హర్యానాకు చెందిన డేరా బాబా (Dera Baba) అలియాస్ రామ్ రహీమ్ తాజాగా జైలు నుంచి విడుదలయ్యాడు. మరోసారి బెయిల్ రావడంతో అతను ఈరోజు (జనవరి 28) ఉదయం జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆయనను స్వాగతించేందుకు డేరా బాబా ప్రధాన శిష్యురాలు హనీప్రీత్ స్వయంగా కారులో జైలుకు వచ్చింది. 30 రోజుల పాటు పెరోల్ రావడంతో డేరా బాబా నేరుగా సిర్సా డేరా సచ్చా సౌదాకు చేరుకోనున్నాడు.
ఆ కేసులో పెరోల్
ఇప్పటికే, డేరా బాబా 2024 అక్టోబర్‌లో బెయిల్ మీద బయటకు రాగా.. ఆ సమయంలో అతను 20 రోజుల పాటు యూపీలోని బర్నావా ఆశ్రమంలో ఉన్నాడు. 2017లో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్‌కు కోర్టు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. మరోవైపు 16 సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్టు హత్య కేసులో డేరా బాబాతో పాటు మరో ముగ్గురు దోషులుగా తేలారు.






