ధనుష్ D54 పోస్టర్ విడుదల.. మిస్టరీతో నిండిన థ్రిల్లర్ రాబోతుందా?

తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush) మరోసారి ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే థ్రిల్లర్(Thrillar) సినిమాతో రాబోతున్నారు. ఇటీవలే ‘కుబేర’ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన ఆయన, తన 54వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి D54 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘Por Thozhil’(పోర్ తొళిల్‌)వంటి హిట్ థ్రిల్లర్ తెరకెక్కించిన దర్శకుడు విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డా. ఇషారి కె. గణేష్ నిర్మించబోతున్నారు. థింక్ స్టూడియోస్ కూడా సహనిర్మాతగా పాల్గొంటోంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఈ సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచింది. పోస్టర్‌లో పత్తి పంటల మధ్య నిలబడి ఉన్న ధనుష్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. అతని వెనుక ఎగసిపడుతున్న మంటలు, మిస్టీరియస్ వాతావరణం ఈ సినిమా ఓ ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ఉండబోతోందన్న సంకేతాలు ఇస్తోంది.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు నటిస్తున్నారు. సంగీతాన్ని యువ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. నటీనటుల పరంగా చూస్తే కూడా ఈ సినిమా భారీగా రూపొందుతోంది. ప్రముఖ నటులు జయరామ్, కె.ఎస్. రవికుమార్, సూరజ్ వెంజరమూడు, కరుణాస్, పృథ్వీ పాండిరాజ్ వంటి నటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ధనుష్ తన ఫిల్మోగ్రఫీలో ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తూ ఉండటం తెలిసిందే. D54 చిత్రం కూడా అలాంటి మరో వినూత్న ప్రయోగంగా నిలిచే అవకాశముంది. థ్రిల్, డ్రామా, ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా 2025లో విడుదలయ్యేలా చిత్రబృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *