మంచి ఆరోగ్యానికి ఆహారం(Food).. నీరు(Water).. గాలి(Air) ఎంత అవసరమో.. నిద్ర అంతకూడా అంతే అవసరం. ఒకవిధంగా చెప్పాలంటే మనం తిండి, నీరు లేకపోయినా ఒకటిరెండ్రోజులు బతకగలం.. కానీ ఒక్కరోజు నిద్రలేకపోతే అంతే సంగతులు.. ఆ మరుసటి రోజంతా మనం మనలోకంలో ఉండం.. ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంటుంది.. నిద్ర(Sleep) మనల్ని రీప్రెష్ చేస్తుంది.. రోజంతా బిజీబిజీగా మనకి రోజులో కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అయినా అవసరం. ఒకవిధంగా చెప్పాలంటే నిద్ర ద్వారానే శరీరం కొత్త ఉత్సాహాన్ని పొందుతుందని, లేకపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అధ్యయనం ఏం చెబుతుందంటే..
తాజాగా వెల్లడైన ఓ అధ్యయనం(Research)లో రోజుకు నాలుగు గంటల పాటు నిద్రపోయేవారు.. లేకుంటే అర్ధరాత్రంతా(Mid night) మేల్కొని ఆరు గంటలు నిద్రతో సరిపెట్టుకునే వారు.. మరుసటి రోజు యాక్టివ్(Active)గా పనిచేయలేరని తేలింది. అయితే పట్టణాల్లో ఉండే వారికంటే గ్రామాల్లో ఉండే వారు త్వరగా నిద్రపోతుంటారు. దీంతో చాలా ఎక్కువసేపు నిద్రించే ఆస్కారం ఉంటుంది. అందుకే వారు చాలా హెల్దీగా ఉంటారంది. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే మరో కోణంలో కొందరు మధ్యరాత్రి లేచినప్పుడు గజ్జల సవ్వడి(sound of a crow) వినపడుతోందని చెబుతుంటారు. లేదా.. గజ్జల శబ్దానికే కొందరు నిద్ర లేచి కంగారు పడుతుంటారు. ఎంతో భయాందోళనకు గురవుతుంటారు.

అర్ధరాత్రి 12 గంటల నుంచి మూడు వరకు
అయితే.. రాత్రి పూట గజ్జల చప్పుడు వినబడితే మంచిదా? కాదా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. పలువురి పండితుల వివరణ ప్రకారం.. అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 వరకు గజ్జల శబ్దం వినపడితే, అది ఎంతో మంచిదట. మీకు శుభం కలుగుతుందని సూచిస్తుందట. కాబట్టి ఈ సమయంలో గజ్జల శబ్దం వినపడితే భయపడక్కర్లేదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో గజ్జలు శబ్దం మీకు వినబడితే లక్ష్మీదేవి(Goddess Lakshmi) మీ ఇంటికి వస్తున్నట్లు దానికి అర్థమంటున్నారు. లేదంటే కులదేవత, గ్రామ దేవత సంచరిస్తున్నట్లు దానికి అర్థమని చెబుతున్నారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని వివరిస్తున్నారు.







