ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PGCET 2025) ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Education Minister Nara Lokesh) ఫలితాలను ఎక్స్(X) వేదికగా రిలీజ్ చేశారు. కాగా ఈ ఏడాది ఏపీపీజీసెట్లో 88.60 శాతం మంది క్వాలిఫై అయినట్లు మంత్రి తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 9 నుంచి 12 వరకు జరిగిన ఈ పరీక్షల్లో 25,688 మంది విద్యార్థులు ఎగ్జామ్స్(Exams) రాయగా.. 19,488 మంది ఉత్తీర్ణులు అయ్యారు.
📢 APPGCET- 2025 results are out!
✅ 88.60 % overall pass rate across 31 Branches
📈 25,688 registered | 19,488 qualified
7463 (87.70 %) 👦 boys & 12025 (89.17 %) 👧girls qualified
🔗 Download rank cards: https://t.co/wtuYexIxB7
📱Also through Mana Mitra WhatsApp No.…
— Lokesh Nara (@naralokesh) June 25, 2025
వీరిలో 7,463 బాలురు అంటే 87.70 శాతం.. 12,025 మంది బాలికలు అంటే 89.17 శాతం అర్హత సాధించినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ ఫలితాలకు సంబంధించిన మార్కులు, ర్యాంక్ కార్డ్(Rank Card) కోసం వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspxలో చూసుకోవచ్చని సెట్ ఛైర్మన్ డా. అప్పారావు, కన్వీనర్ డా.పీసీ వెంకటేశ్వర్లు(Venkateshwarlu) వెల్లడించారు. ఇక వీటికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ వచ్చేనెల నుంచి ప్రారంభం కానుంది.








