సంగారెడ్డి (Sangareddy) జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ఘోరం జరిగింది. భారీ పేలుళ్లు సంభవించి పది మంది మృతిచెందారు. పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం రియాక్టర్ పేలింది (Reactor Blast). దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి అందులోని 20 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతో మరో ఐదురుగు చనిపోయినట్లు సమాచారం.
మరి కొందరి పరిస్థితి విషయం
ప్రమాదంలో గాయపడిన వారిని చందానగర్, ఇస్నాపూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పరిశ్రమ లోపల మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 11 ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను కంట్రోల్ చేసేందుకు యత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
#Telangana: Reactor blast in Pashamylaram, #Patancheru area’s Sigachi Chemical Factory leaves many injured.
A major explosion occurred at the Sigachi Chemical Factory in Sangareddy district this morning. A chemical reactor exploded in the factory in causing a huge fire. With… pic.twitter.com/yf5OoQPd7r
— South First (@TheSouthfirst) June 30, 2025






