టీమ్ఇండియా(Team India) టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) దేశవాళీ క్రికెట్(Domestic cricket)లో ఆడనుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన గిల్, ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో నార్త్ జోన్(North Zone) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత జట్టుకు అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ టోర్నీలలో పాల్గొనాలని BCCI ఇటీవల తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కెప్టెన్ అయినప్పటికీ దేశవాళీ టోర్నీలో ఆడేందుకు గిల్ ముందుకు రావడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ప్రశంసలు కురిపించారు.

దేశవాళీ క్రికెట్‌కు BCCI ప్రాధాన్యత
“భారత కెప్టెన్ స్వయంగా దులీప్ ట్రోఫీలో పాల్గొనడం ఈ టోర్నమెంట్‌కు పెద్ద బూస్ట్. తన నిర్ణయం ద్వారా గిల్ జట్టులోని ఇతర సభ్యులకు సరైన సందేశాన్ని పంపుతున్నాడు” అని గవాస్కర్ ఒక క్రీడా పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. శ్రీలంక(Srilanka)తో వైట్-బాల్ సిరీస్ కోసం జట్టును పంపకుండా దేశవాళీ క్రికెట్‌కు BCCI ప్రాధాన్యత ఇవ్వడం మంచి నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు.
Shubman Gill skips rest to lead North Zone in Duleep Trophy! 👏 Sunil Gavaskar hails his commitment to Indian cricket. 🇮🇳🔥#ShubmanGill #DuleepTrophy #IndianCricket #SunilGavaskar #TeamIndia https://t.co/F60xhS1xbT
— Cricadium (@Cricadium) August 12, 2025
ఇటీవల ఇంగ్లండ్(England)తో ముగిసిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో గిల్ అద్భుతమైన ఫామ్ ప్రదర్శించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఏకంగా 754 పరుగులు సాధించి, ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. 1971లో గవాస్కర్ చేసిన 774 పరుగులే ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. ఇంతటి కీలక సిరీస్ ముగిసిన నెల రోజుల్లోపే గిల్ దేశవాళీ టోర్నీకి సిద్ధమవడం అతని నిబద్ధతకు నిదర్శనంగా క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.






