Mana Enadu : ప్రస్తుత కాలంలో బంగారం కొనాలంటే సామాన్యులు బెంబేలెత్తుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలు చూసి ఎప్పటికైనా తాము పసిడిని కొనుగోలు చేయగలమా లేదా అని ఆందోళన చెందుతున్నారు. ఇక ఇటీవల పసిడి ధరలు (Gold Price) హెచ్చుతగ్గులతో వినియోగదారులను అయోమయానికి గురి చేస్తున్నాయి. గోల్డ్ కొనాలనుకునేవారు రోజురోజు ధరలను నిశితంగా గమనిస్తూ కాస్త తగ్గింది అనిపించినప్పుడు వెంటనే షాపులకు పరిగెత్తుతున్నాయి. మరి మీరు కూడా బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి..
హైదరాబాద్ లో బంగారం ధర ఎంతంటే?
దేశంలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు (Silver Price Today) దాదాపు స్థిరంగా ఉన్నాయి. శనివారం రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.78,600 పలికింది. ఇక ఇవాళ (ఆదివారం) నాటికి రూ.100 పెరిగి రూ.78,700కు చేరుకుంది. కిలో వెండి ధర శనివారం నాడు రూ.89,600 ఉండగా, నేడు అది రూ.82 పెరిగి రూ.89,682కు చేరుకుంది. హైదరాబాద్(Hyderabad Gold Price)లో పది గ్రాముల బంగారం ధర రూ.78,700.. కిలో వెండి ధర రూ.89,682గా ఉంది.
విజయవాడలో నేటి పసిడి ధరలు
ఇక ఏపీలోనూ బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర (Gold Price in Vijayawada) రూ.78,700గా ఉండగా. కిలో వెండి ధర రూ.89,682గా ఉంది. ఇక విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి రూ.78,700 పలుకగా.. కిలో వెండి ధర రూ.89,682 వద్ద విక్రయిస్తున్నారు. మరోవైపు ప్రొద్దుటూరులో 10 గ్రాముల బంగారం ధర రూ.78,700 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.89,682గా ఉంది. ఈ బంగారం, వెండి ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి.







