BREAKING: జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్.. మళ్లీ దాడులు జరగొచ్చున్న నిఘా వర్గాలు

జమ్మూకశ్మీర్‌(Jammu And Kashmir)లో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దీంతో భారీగా భద్రతా బలగాల(Security forces)ను జమ్ముూకశ్మీర్‌కు తరలిస్తున్నారు. మరోవైపు జమ్ముూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు(Intelligence Agencies) హెచ్చరించాయి. భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇదిలా ఉండగా నిన్న జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారిని అధికారులు వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నాలుగు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది మరణించగా.. మరో 20 మంది గాయపడ్డారు. మృతిచెందిన వారిలో విదేశీ టూరిస్టులు(Foreign Tourists) కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఉరిలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు మృతి

భారత్-పాకిస్థాన్(India-Pak Boarder) సరిహద్దుల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్‌లోని ఉరి సెక్టార్(Uri Sector) వద్ద నియంత్రణ రేఖ నుంచి ఇద్దరు, ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు(Pakistani Terrorists) భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని చొరబాటు యత్నాన్ని భారత సైన్యం అడ్డుకుంది. ఆ ప్రాంతంలో పెద్దఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. మరోవైపు బారాముల్లా జిల్లాలోని ఉరిలో ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. వారి వద్ద భారీగా ఆయుధాలు, పేలు పదార్థాలను సైన్యం స్వాధీనం చేసుకుంది.

ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం

ఇదిలా ఉండగా జాతీయ భ‌ద్రతా స‌ల‌హాదారు(NSA) అజిత్ దోవల్‌, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎన్ జైశంక‌ర్‌, విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్త్రీతో ప్రధాని మోదీ(PM Modi) స‌మావేశ‌మై ఉగ్ర ఘ‌ట‌న‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానికి దాడి జ‌రిగిన తీరును వివ‌రించారు. కాగా, బుధవారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల కేబినెట్ క‌మిటీ స‌మావేశం(Cabinet Committee Meeting) జరగనుంది.

Related Posts

Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన

ఐర్లాండ్‌(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. సీఎం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *