డాక్టర్ అవతారం ఎత్తిన ‘హిట్ 3’ నటి.. ఇక సినిమాలకు గుడ్బై..! ఎవరంటే..?

విశాఖపట్నం లో జన్మిచిన కోమలి ప్రసాద్(Komalee Prasad) చిన్నప్పటినుంచి చదువులో చురుకుగా ఉండేది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించిన ఈ అమ్మడు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఉన్న ప్రవర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మెడిసిన్ పూర్తి చేసింది. చదువులోనే కాదు, క్రీడలలోనూ ఆమె టాలెంట్ చూపించింది. జాతీయ స్థాయిలో కోకో, బ్యాడ్మింటన్ క్రీడల్లో గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది. ఆమె ఓ క్లాసికల్ డాన్సర్ కూడా.

మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత కోమలి న్యూయార్క్‌ వెళ్లి మాస్టర్స్‌ చదవాలనే ఆలోచనలో ఉండగా, అనుకోకుండా సినిమా అవకాశమొచ్చింది. సినిమా ఛాన్స్‌ రావడంతో విదేశాల్లో చదువుకోవాలన్న ప్లాన్‌ను పక్కన పెట్టి ఇండస్ట్రీలోకి అడుగుపెటింది. 2016లో ‘సీతాదేవి’ (Seetha Devi)అనే టీవీ సిరీస్‌తో ఎంట్రీ ఇచ్చిన కోమలి ప్రసాద్‌ ఆ తర్వాత సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Komalee Prasad (@komaleeprasad)

‘నెపోలియన్’, ‘అనుకున్నది ఒకటి అయినది మరొకటి’, ‘రౌడీ బాయ్స్’, ‘సెబాస్టియన్ పీసీ 524’, ‘హిట్ 2’, ‘హిట్ 3’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవల విడుదలైన నాని బ్లాక్‌బస్టర్ *‘హిట్ 3’*లో ఎస్పీ వర్షా పాత్రలో మెరిశారు. నటిగా మాత్రమే కాకుండా టీవీ షోలలోనూ ఆమె చురుకుగా కనిపిస్తున్నారు. తమిళ చిత్రాల్లోనూ తళుక్కుమన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Komalee Prasad (@komaleeprasad)

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటలను, వీడియోలను పోస్ట్ చూస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఇక తాజాగా కోమలి ప్రసాద్ ఒక ఇంట్రస్టింగ్ పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వైట్ కోట్ ధరించి తీసుకున్న కొన్ని ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ – “అందరూ స్వచ్ఛమైన స్మైల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి.. త్వరలోనే డాక్టర్ కోమలి ప్రసాద్ రాబోతోంది” అనే క్యాప్షన్‌తో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె డెంటిస్ట్ గా మెడికల్ ప్రాక్టీస్‌ ప్రారంభించినట్టు కోమలి స్పష్టం చేసింది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *