తెలంగాణ(Telangana)లో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు(Heavy Rains), రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాల సూచనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం(TG Govt) కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Center) నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్(Video conference) నిర్వహించి, వర్షాలు, వరదలపై సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
వరద ప్రభావిత జిల్లాల్లో ముందస్తు చర్యలు
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే 72 గంటలు అన్ని శాఖల ఉద్యోగుల సెలవులను రద్దు(Holidays canceled) చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌తో సహా వరద ప్రభావిత జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణ(Traffic control)కు పోలీసుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆకస్మిక వరదల సందర్భంలో ఎయిర్ లిఫ్టింగ్ కోసం హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని, NDRF సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించాలని, వర్షాల సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాలని సూచించారు.
టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశం
అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, విద్యాసంస్థలకు సెలవులు, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. వరదలపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్(Toll Free Number) ఏర్పాటు చేయాలని, హైడ్రా(HYDRA) సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రాణ, ఆస్తి, పశు సంపద నష్టం జరగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు.
రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం… pic.twitter.com/qblr7doz4P
— Telangana CMO (@TelanganaCMO) August 12, 2025






