పాక్‌కు మరో షాకిచ్చిన భారత్.. మెయిల్స్, పార్సిళ్ల మార్పిడి నిలిపివేత

ఇటీవల జమ్మూకశ్మీర్‌(J&K)లోని పహల్గామ్‌(Pahalgam)లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి(Terror Attack) నేపథ్యంలో భారత్(India) పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే సింధు జలాల(Sindu River Water) ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్.. పలు కీలక ఆంక్షలు విధించింది. తాజాగా పాకిస్థాన్‌కు మరో షాకిచ్చింది. పాక్‌ నుంచి భారత్‌కు వచ్చే అన్ని రకాల మెయిల్స్(Mails), పార్సిళ్ల మార్పిడి(Exchange of parcels)ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో ఎయిర్ వే, రోడ్డు, సముద్ర మార్గం ద్వారా వచ్చినా ఈ నిషేధం(Ban) వర్తిస్తుందని స్పష్టం చేసింది.

India suspends mail, parcel services with Pakistan through air, surface  routes - The Hindu

ఇప్పటికే పాకిస్థాన్(Pakistan) నుంచి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ జరిగే అన్ని రకాల దిగుమతుల(Imports)పై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా తీసుకున్న మెయిల్స్, పార్సిళ్ల నిలిపివేత నిర్ణయం ఈ ఆంక్షల పరంపరలో మరొకటి. అంతేకాకుండా, ఇరు దేశాల మధ్య సముద్ర మార్గ రవాణా(Sea transport)ను కూడా భారత్ మూసివేసింది.

ఈ-కామర్స్ వస్తువుల ఎగుమతి పరిమితం చేసేలా..

పాకిస్థాన్ జెండాతో ప్రయాణించే ఏ నౌక అయినా భారత ఓడరేవుల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. కాగా, పాకిస్థాన్ విమానాలు(Pakistan Airlines) భారత గగనతలంపై ప్రయాణించకుండా ఇప్పటికే నిషేధం అమలులో ఉంది. వీటితో పాటు, పాకిస్థాన్‌కు ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ వస్తువుల ఎగుమతి(Export of e-commerce goods)ని కూడా పరిమితం చేసే దిశగా భారత్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Related Posts

Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన

ఐర్లాండ్‌(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. సీఎం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *