2022లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాంతార(Kanthara)’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార: చాప్టర్ 1(Kanthara Chapter-1)’ నుంచి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో కథానాయిక కనకవతి పాత్రలో ప్రముఖ నటి రుక్మిణీ వసంత్(Rikmini Vasanth) నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వరమహాలక్ష్మీ వ్రతం సందర్భంగా రుక్మిణి ఫస్ట్ లుక్ పోస్టర్(First Look Poster)ను విడుదల చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
యువరాణి లుక్‌లో గంభీరంగా రుక్మిణి
ఇక ఈ పోస్టర్‌లో రుక్మిణి రాజసమైన యువరాణి లుక్‌లో గంభీరంగా, శక్తిమంతంగా కనిపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం కదంబుల సామ్రాజ్య(Kadambula Empire) కాలంలోని కథాంశంతో తెరకెక్కుతోంది. భూతకోల ఆచారం వెనుక ఉన్న పురాణ గాథను ఆవిష్కరించనున్న ఈ ప్రీక్వెల్‌లో రిషభ్ శెట్టి(Rishabh Shetty) అతీత శక్తులు కలిగిన నాగ సాధువు పాత్రలో నటిస్తున్నారు. రుక్మిణి పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా సస్పెన్స్‌గా ఉన్నప్పటికీ, ఆమె రాజసభ నేపథ్యంలో కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గాంధీ జయంతి సందర్భంగా విడుదల
హొంబలే ఫిల్మ్స్(Hombale Films) బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ, అజనీష్ లోక్‌నాథ్(Ajanish Lokanath) సంగీతం ఈ చిత్రానికి మరింత బలం చేకూరుస్తున్నాయి.
Introducing @rukminitweets as ‘KANAKAVATHI’ from the world of #KantaraChapter1.
ಕನಕವತಿಯ ಪರಿಚಯ ನಿಮ್ಮ ಮುಂದೆ.
कनकवती का परिचय आपके लिए.
కనకవతి ని మీకు పరిచయం చేస్తున్నాం.
கனகாவதியை பற்றிய அறிமுகம் உங்கள் முன் உள்ளது.
കനകാവതിയുടെ ആമുഖം നിങ്ങൾക്കുമുമ്പിൽ.
আপনাদের সামনে কনকবতীকে… pic.twitter.com/4JmMy901un— Hombale Films (@hombalefilms) August 8, 2025






