కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఆనందంగా సంబురాలు చేసుకోవాలని చింతకాని సబ్ ఇన్స్పెక్టర్ షేక్ నాగుల్‌మీరా సూచించారు. ముందుస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మండల ప్రజలకు తెలిపారు. నేటి సాయంత్రం ఐదు గంటల నుంచే మండల వ్యాప్తంగా పోలీస్ పహారా ఉంటుందన్నారు.
బహిరంగంగా వేడుకలు నిర్వాహించేందుకు ఎటువంటి అనుమతులు లేవన్నారు.144 సెక్షన్ అమలులో ఉందని ఐదుగురు, అంతకన్నా ఎక్కువ వ్యక్తులు గుమ్మిగూడటం చేయద్దొన్నారు.
యువత గుంపులుగా చేరి రోడ్లపై కేకలు వేస్తూ అల్లరి చేయడంతోపాటు వాహనాలపై తిరగడం మండలంలో పూర్తిగా నిషేదమని ప్రకటించారు.అనవసరంగా నూతన సంవత్సర వేళ కొత్త చిక్కులు కొని తెచ్చుకోకండని చెప్పారు.
అల్లర్లకు పాల్పడితే అస్సలు ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని అల్లరిమూకలను హెచ్చరించారు.









