Kubera Collections: ‘కుబేర’ ఫస్ట్​ డే కలెక్షన్స్​ ఎంతో తెలుసా?

శేఖర్​ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ ఈ నెల 20న విడుదలై హిట్​ టాక్​ తెచ్చుకుంది. ధనుష్‌ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక (Rashmika) కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా బిచ్చగాడిగా ధనుష్​ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలారోజుల తర్వాత మళ్లీ జోష్ కనిపిస్తోంది. ‘కుబేర’ రిలీజ్‌కి ముందు పెద్ద హడావుడి గానీ హైప్ గానీ లేదు. తొలిఆట తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే తొలిరోజు వసూళ్లలో మంచి నంబర్స్ కనిపించాయి.

Kuberaa Movie Review: A Bold Concept with Mixed Execution

నాగార్జున, శేఖర్ కమ్ములకు హైయ్యెస్ట్​ కలెక్షన్స్​

తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేశారు గానీ, తమిళనాడులో మాత్రం సాంకేతిక కారణాలతో విడుదలకు ముందురోజు బుకింగ్స్ తెరిచారు. అయినా సరే మౌత్ టాక్ ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్‌గా వస్తోంది. అలా తొలిరోజు తెలుగు, తమిళంలో కలిపి రూ.13 కోట్ల మేర నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. తొలిరోజు వసూళ్ల బట్టి చూస్తే ధనుష్‌కి కెరీర్ పరంగా ఇది రెండో బిగ్గెస్ట్ కలెక్షన్ కాగా.. నాగార్జున, శేఖర్ కమ్ములకు మాత్రం ఇదే అత్యధికం. పాజిటివ్​ టాక్​ సంపాదించుకున్న ఈ మూవీ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ నంబర్స్ ఇంకా పెరగొచ్చు. దీంతో నిర్మాతలతోపాటు చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది.

Dhanush Nagarjuna Starring Kubera Movie X Review Tamil How Is The Film  Directed By Sekhar Kammula Is It Worth The Watch | தனுஷின் குபேரா படம்  எப்படியிருக்கு ரசிகர்களின் நேர்மையான X தள ...

ధనవంతుడు, బిచ్చగాడికి మధ్య జరిగే పోరాటం

అత్యంత ధనవంతుడు, ఏమీ ఆశించని ఓ బిచ్చగాడికి మధ్య జరిగే పోరాటమే కుబేరా. బిచ్చగాడి పాత్రలో ధనుష్​ అదిరిపోయే పెర్ఫార్మెన్స్​ కనబరిచారు. నాగార్జున, రష్మిక పాత్రలు కూడా మెప్పించాయి. ఫ‌స్టాఫ్​ను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకుడికి ఎక్కడా బోర్​ అనిపించదు. అనుకోని పరిస్థితుల్లో ఆపదలో ఇరుక్కున్న ర‌ష్మిక‌ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్​ ఇచ్చింద‌ని చెప్పవచ్చు. సెకండాఫ్ ఫ్రీ క్లైమాక్స్‌లో కాస్త సాగదీతగా అనిపించింది. మూవీ ర‌న్ టైమ్​ 3 గంటలపైనే ఉండడంతో కొన్ని చోట్ల మిన‌హా సినిమా బోర్​ కొట్టకుండా ముందుకు సాగుతుంది. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *