టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’(Kubera) ఈ నెల 20న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika) కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటూ విజయపథంలో దూసుకెళ్తోంది. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ధనుష్ నటన, సినిమాకున్న ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాజిటివ్ మౌత్ టాక్ కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపిస్తూ, సినిమా కలెక్షన్ పరంగా జెట్ స్పీడ్‌లో ముందుకు సాగుతోంది.
ఈ సినిమా విడుదలైన మొదటి రోజే నైజాం ఏరియాలో రూ.2.7 కోట్లు షేర్ వసూలు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇక మొదటి రోజు కంటే రెండో రోజున కలెక్షన్లు మరింతగా పెరిగాయి. మొదటి రోజుతో పోల్చితే దాదాపు రూ.1 కోట్లకుపైగా అదనంగా వసూలు చేసింది.
అంతేకాదు, ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ సాక్ నిల్క్ అందించిన సమాచారం ప్రకారం, రెండో రోజున ఇండియా నెట్ వసూళ్లు రూ.16 కోట్లు నమోదయ్యాయి. దీంతో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ చిత్రం వసూలు చేసిన మొత్తం రూ.30.75 కోట్లు ఇండియా నెట్ కాగా, వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.55 కోట్ల వరకు చేరుకున్నాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఈ వేగం చూస్తుంటే ‘కుబేర’ మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయం అనిపిస్తోంది. ప్రేక్షకుల మద్దతుతో పాటు బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగుతుండటంతో, మూవీ టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది.






