ఏపీలోని నిరుద్యోగులకు(Unemployed in AP) మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) గుడ్న్యూస్ చెప్పారు. ఈ మార్చిలోనే మెగా డీఎస్సీ(Mega DSc) ఇస్తామని తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు నారా లోకేశ్ సమాధానమిచ్చారు. హేతుబద్ధీకరణకు సంబంధించిన GO NO.117ను రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా పలు విధానాలు తెస్తామని చెప్పారు. టీచర్ల బదిలీల చట్టం(Teachers Transfer Act)తో పాటు వారికి ప్రమోషన్లు(Promotions), పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలపై పలు విషయాలు తెలిపారు. తమ ప్రభుత్వం APలో రాజకీయాలకు అతీతంగా విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తోందని అన్నారు.

నూతన సంస్కరణలకు శ్రీకారం
భారత్(India)లోనే ఏపీ విద్యా వ్యవస్థ(AP Education System)ను అగ్రస్థానంలో నిలపాలన్న CM చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామని, ఇందుకు తగ్గ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. G.O 117 వల్ల కలిగిన ప్రతికూల ఫలితాల గురించి గతంలో చాలా మంది తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. ఆ జీవో పేరుతో గత YCP సర్కారు చేసిన నిర్వాకం వల్ల అప్పట్లో సర్కారు స్కూళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు(Students) తగ్గిపోయారన్నారని తెలిపారు.
త్వరలోనే పాఠ్యపుస్తకాల్లో మార్పులు
అలాగే త్వరలోనే అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్లో మార్పులు తెస్తామని స్పష్టం చేశారు. ఆదర్శ పాఠశాలల(Ideal schools)తో పాటు ఇతర ఉన్నత పాఠశాలలు ఏయే విద్యార్థులకు ఇంటి నుంచి చాలా దూరం ఉంటున్నాయో వారికి రవాణా భత్యం(Transport Allowance) ఇస్తామన్నారు. వీలైనంత త్వరలోనే సర్కారు విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామని లోకేశ్ చెప్పారు.






