ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలనేవి వస్తూ పోతూ ఉంటాయి. అలాగే మెగా డాటర్ నిహారిక(Niharika)కు లైఫ్ లోను అదే జరిగింది. ఎంతో అపురూపంగా పెరిగిన నిహారిక, పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది. 2020లో చైతన్య జొన్నలగడ్డ(Chaithanya Jonnala Gadda)ను వివాహం చేసుకుంది. మొదట్లో అన్యోన్యంగా ఉన్న వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు మొదలయ్యాయి. దూరాలు పెరిగి చివరికి 2023లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు(Nagababu) ఓ ఇంటర్వ్యూలో తన కుమార్తె నిహారిక గురించి మాట్లాడుతూ.. “నిహారికతో నేను ఎక్కువగా మాట్లాడుకుంటం. పిల్లల కెరీర్లు ఎలా ఉన్నాయన్నదానికన్నా, వాళ్లు సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే నాకు ముఖ్యం. వాళ్లు ఆనందంగా లేకపోతే ఎన్నో కోట్లు ఉన్నా వృథానే” అన్నారు. వరుణ్ తేజ విషయాన్ని గుర్తు చేస్తూ “లావణ్యను పెళ్లి చేసుకుంటాను అని వాడు నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, ‘నువ్వు ఆమెతో సంతోషంగా ఉంటావా?’ అని మాత్రమే అడిగాను. అప్పుడు వాడు హ్యాపీగా ఉంటాం అన్నాడు. పెళ్లి జరిపించాము. వారిద్దరూ సంతోషంగా ఉన్నారు”. అని పేర్కొన్నారు.
అయితే నిహారిక వివాహం విషయంలో ఆయన బాధను చెప్పుకొచ్చాడు నాగబాబు. “నిహారిక విషయంలో నా జడ్జిమెంట్ తప్పు. అయితే ఆ పెళ్లి ఆమె ఇష్టంతోనే జరిగింది. కానీ తాను, చైతన్య కలిసి ఉండలేకపోయారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోయారు. వాళ్లను కలిపే ప్రయత్నం నేను చేయలేదు. ఇష్టం లేదన్నారు, సరేనని అంగీకరించాం” అంటూ తల్లిదండ్రిగా బాధను వ్యక్తం చేశారు.
ప్రస్తుతం నిహారిక సినిమాల నిర్మాణంలో బిజీగా ఉంది. ఆమె భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేసిన నాగబాబు, “కొంతకాలం తరువాత మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుందని నమ్ముతున్నాను” అంటూ చెప్పారు.






