జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం(Pahalgam) వద్ద ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి(Terror Attack) ఘటనపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
‘Terrorism is an enemy of humanity’@RIL_Updates Chairman Mukesh Ambani condemned the terrorist attack on tourists in Pahalgam and expressed solidarity with those injured👇https://t.co/Px7UcavvyL#MukeshAmbani #PahalgamTerroristAttack #JammuAndKashmir #Terrorism pic.twitter.com/IJTGOaWkea
— Moneycontrol (@moneycontrolcom) April 24, 2025
భారత ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం..
ఉగ్రవాదం అనేది మానవాళికి పెను ముప్పు అని, అది ఏ రూపంలో ఉన్నా సహించరాదని అన్నారు. ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించకూడదన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం, PM మోదీ చేస్తున్న కృషికి రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఉచితంగా అత్యున్నత వైద్య సేవలు
ఈ సందర్భంగా ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ముకేశ్ అంబానీ ఆకాంక్షించారు. అంతేకాకుండా, ఈ దాడిలో గాయపడిన వారికి అండగా నిలుస్తూ కీలక ప్రకటన చేశారు. క్షతగాత్రులకు అవసరమైన అత్యున్నత వైద్య సేవల(Top-notch medical services)ను ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన సర్ హరికిషన్ దాస్ నరోత్తమ్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్(Sir Harikishan Das Narottam Reliance Foundation Hospital)లో పూర్తిగా ఉచితం(Free)గా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.








