Mahakumbh: కుంభమేళా తొక్కిసలాట.. సహాయక చర్యలపై PM మోదీ ఆరా

మహా కుంభమేళా(Mahakumbha Mela) ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక కార్యక్రమం. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహత్తర వేడుక. కోట్లాది మంది తరలివచ్చే బృహత్తర ఆధ్యాత్మిక ఉత్సవం. 45 రోజుల పాటు కొనసాగే ఈ మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అందుకు తగ్గట్లే ఉత్తర ప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో సీఎం యోగీ ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేసింది. అయినా పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం మౌని అమావాస్య(Mauni Amavasya) సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట(Stampede) జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 50 మందికిపైగా గాయాలైనట్లు అధికారులు చెబుతున్నారు.

జనం ఒక్కసారిగా ఎగబడటంతోనే..

అమృత స్నానాల(Amrita baths) కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సెక్టార్-2 ఆస్పత్రికి తరలించారు. మహా కుంభమేళాలో తొక్కిసలాట విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) వెంటనే యూపీ సీఎం యోగి(UP CM Yogi)తో 3సార్లు ఫోన్‌లో మాట్లాడారు. అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్షించారు. మహాకుంభమేళా ప్రస్తుత పరిస్థితి గురించి, సహాయకచర్యలపై ప్రధాని మోదీ సీఎం యోగిని అడిగి తెలుసుకున్నారు. గాయాలైన వారికి(For the wounded) వెంటనే చికిత్స అందించాలని పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. అటు హోంమంత్రి అమిత్ షా(Amit Shah) సైతం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

16 రోజుల్లో 19.94 కోట్ల మంది పుణ్యస్నానాలు

ఇదిలా ఉండగా ఈ ఘటనతో దాదాపు 16 అఖాడాలు(Akhadaas) పుణ్యస్నానాలు రద్దు చేసుకున్నారు. మరోవైపు ఇవాళ ఉ.6 గంటల వరకే 1.75 కోట్ల మందికిపైగా స్నానాలు ఆచరించారు. మొత్తం 16 రోజుల్లో 19.94 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. అటు కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తడంతో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ఆయా మార్గాల్లో 47కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్(Traffic Jaam) అయింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిపోయాయి.

Related Posts

Nirmal Kapoor: బాలీవుడ్‌లో విషాదం.. నిర్మల్ కపూర్ కన్నుమూత!

బాలీవుడ్‌(Bollywood)లో విషాదం చోటుచేసుకుంది. నటులు అనిల్ కపూర్, సంజయ్ కపూర్, నిర్మాత బోనీ కపూర్ తల్లి, నిర్మల్ కపూర్(90) కన్నుముశారు. ఇవాళ సాయంత్రం (మే 2) 5:45 గంటల ప్రాంతంలో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్(Dhirubhai Ambani Hospital)లో ఆమె…

Aghori: లేడీ అఘోరీకి 14 రోజుల రిమాండ్.. సంగారెడ్డి సబ్ జైలుకు తరలింపు

గత కొంతకాలంగా తెలుగురాష్ట్రంలో హల్చల్ చేస్తున్న అఘోరీ నాగసాధు(Aghori Nagasadhu) పోలీసులు నిన్న అరెస్టు(Arrest) చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక పూజల(Special Pooja) పేరుతో ఓ మహిళ నుంచి రూ.10 లక్షలు తీసుకొని మోసం చేసిందన్న ఆరోపణలతో ఆమెను ఉత్తరప్రదేశ్‌(UP)లో అరెస్టు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *