ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Modi) నేడు (ఆగస్టు 10) కర్ణాటక రాజధాని బెంగళూరు(Bangalore)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల(Development projects)ను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్(KSR Railway Station)లో మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల(Vande Bharat Express trains)ను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇవి బెంగళూరు-బెలగావి, అమృత్సర్-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, నాగ్పూర్ (అజ్నీ)-పుణే మధ్య నడుస్తాయి. అనంతరం, బెంగళూరు మెట్రోకు సంబంధఇంచి ఎల్లో లైన్ను (ఆర్వీ రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు) ప్రారంభించి, RV రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రో ప్రయాణం చేస్తారు. ఈ ఎల్లో లైన్ 19.15 కిలోమీటర్లు కాగా, 16 స్టేషన్లతో రూ. 7,160 కోట్లతో నిర్మించారు. దీనితో బెంగళూరు మెట్రో నెట్వర్క్ 96 కి.మీ.కు విస్తరిస్తుంది.
బెంగళూరులో ట్రాఫిక్ ఆంక్షలు
ఇక మధ్యాహ్నం 1 గంటలకు, మోదీ బెంగళూరు మెట్రో ఫేజ్-3 ప్రాజెక్టు (44KM, 31 ఎలివేటెడ్ స్టేషన్లు, రూ. 15,610 కోట్లు) శంకుస్థాపన చేస్తారు. అదే సమయంలో పట్టణ కనెక్టివిటీ(Urban connectivity) ప్రాజెక్టులను ప్రారంభించి ప్రజా సభలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా బెంగళూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా మారెనహళ్లి, సిల్క్ బోర్డ్, హోసూర్ రోడ్లలో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ ప్రాజెక్టులు బెంగళూరు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు.
#WATCH | Bengaluru, Karnataka: Prime Minister Narendra Modi to flag off the Yellow line of Bangalore metro today.
PM Modi will also undertake a metro ride from RV Road (Ragigudda) to Electronic City metro station. pic.twitter.com/YRn1ISS7iD
— ANI (@ANI) August 10, 2025






