Mana Enadu : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) తన మిత్రుడు, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయి (Venkata Datta Sai)తో ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్లోని ఉదయ్ సాగర్ సరస్సులో బంధువులు, స్నేహితుల సమక్షంగో అంగరంగ వైభవంగా వీరి కల్యాణ వేడుక జరిగింది. అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్
అయితే తమ వివాహ వేడుకకు సంబంధించి పీవీ సింధు (PV Sindhu Wedding Photos) తాజాగా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల కింద హార్ట్ ఎమోజీ యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ కొత్తజంట పెళ్లి ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. క్యూట్ పెయిర్, నైస్ జోడీ, అందమైన జంట అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొత్త జంటకు పెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సింధు అంటూ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.
— Pvsindhu (@Pvsindhu1) December 24, 2024
లవ్ ఎట్ ఫస్ట్ సైట్
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింధు వెంకట దత్తసాయితో తన లవ్ స్టోరీ గురించి షేర్ చేసుకుంది. “సాయి నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. అయినా రెండేళ్ల క్రితం తనతో కలిసి చేసిన ఓ ఫ్లైట్ జర్నీలోనే మా లవ్ స్టోరీ మొదలైంది. 2022 అక్టోబరులో మేమిద్దరం కలిసి ఓ విమానంలో జర్నీ చేశాం. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మారిపోయింది. ఆ జర్నీ మమ్మల్ని చాలా దగ్గర చేసింది. ఆ క్షణం నాకు ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (Love At First Sight)’లా అనిపించింది. ఆ క్షణం నుంచి మా ప్రేమ ప్రయాణం మొదలైంది’’ అని సింధు తన ప్రేమ ముచ్చట్లను పంచుకుంది.
అది చాలా ఎమోషనల్ మూమెంట్
ఇక తన నిశ్చితార్థం (PV Sindhu Engagement) గురించి మాట్లాడుతూ.. చాలా తక్కువమంది సమక్షంలో ఆ వేడుక జరిగిందని తెలిపింది. తమ లైఫ్ లో చాలా ముఖ్యమైన ఘట్టాన్ని గ్రాండ్గా చేసుకోవాలనుకోలేదని తెలిపింది. అందుకే తాము నమ్మిన వ్యక్తుల మధ్య సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నట్లు పేర్కొంది. అది చాలా ఎమోషనల్ మూమెంట్ అని.. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అని సింధు వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.








