అందాల తార రంభ రీ-ఎంట్రీకి రెడీనా? సోషల్ మీడియా ఫోటోషూట్‌తో హింట్ ఇచ్చిందా?

టాలీవుడ్ సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అందాల తార రంభ(Rambha).. కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో దూసుకెళ్లి తనదైన ముద్ర వేసుకుంది. మలయాళంలో సర్గం (1992) అనే చిత్రంతో హీరోయిన్‌గా సినీ రంగప్రవేశం చేసిన ఆమె అదే ఏడాదిలో తెలుగులోనూ అడుగుపెట్టారు.

1992లో చిరంజీవి(Chiranjeevi) హీరోగా వచ్చిన అల్లరి మొగుడు చిత్రంలో రంభ నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఆమెకు ఎనలేని క్రేజ్ తెచ్చింది. ఆ తరువాత తమిళం, కన్నడం, హిందీ, బెంగాలీ, బోజ్‌పురి, ఇంగ్లీష్ ఇలా ఎనిమిది భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

సెక్సీ యాక్ట్రెస్‌గా ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రంభ, 2010లో తమిళ సినిమా పెణ్‌ సింగంలో చివరిసారిగా గెస్ట్ పాత్రలో కనిపించింది. అదే సంవత్సరం కెనడాకు చెందిన పారిశ్రామికవేత్త ఇంద్రకుమార్ పద్మనాధన్‌ను వివాహం చేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లిగా కుటుంబ జీవితం గడుపుతోంది. అప్పుడప్పుడూ సోషల్ మీడియా ద్వారా తన కుటుంబ జీవితం, కిడ్స్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.

పెళ్లి తర్వాత కొన్ని సినిమాలలో నటించిన ఆమె 2017 తర్వాత సినిమాలకు పూర్తిగా విరామం ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్దమౌతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పడు, 49 ఏళ్ల వయసులో మళ్లీ సినీ రంగం పై దృష్టి పెట్టిన రంభ.. రీసెంట్‌గా ప్రత్యేకంగా ఓ ఫోటోషూట్ నిర్వహించి, ఆ ఫొటోలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆ ఫోటోలను చుసిన అభిమానులు.. రంభ మళ్లీ సినిమాల్లో అడుగుపెడతారని ఫిదా అవుతున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *