రష్మిక మందన్న లేటెస్ట్ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్ త్వరలో!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘ది గర్ల్ ఫ్రెండ్ (The Girlfriend)’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుండగా, టాలెంటెడ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలుగా ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు.

ఇక తాజాగా మేకర్స్‌ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌(Crazy Update)ను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. “రొమాన్స్, రిథమ్ & రా ఎమోషన్.. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ షూటింగ్ పూర్తి స్థాయిలో జరుగుతోంది. #నాదివే అనే ఉల్లాసభరితమైన పాటను రష్మిక – దీక్షిత్ కలిసి అందించనున్నారు. విడుదల తేదీ ప్రకటనతో పాటు ఫస్ట్ సింగిల్ కూడా త్వరలోనే విడుదల కానుంది” అని ప్రకటించారు.

ఈ అప్డేట్‌తో పాటు విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా రోజులుగా మూవీ నుంచి ఏ అప్‌డేట్ రాక పోవడంతో నిరాశకు గురైన ఫ్యాన్స్ ఇప్పుడు ఈ సాంగ్ న్యూస్‌తో ఎంతో ఆనందంగా ఉన్నారు. రష్మిక నటించిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ నుంచి వచ్చే పాట ఏ స్థాయిలో అలరిస్తుందో అన్న ఆసక్తి ఇప్పటికే మొదలైంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *