తెలుగు సినిమా పరిశ్రమలో యంగ్ హీరో కార్తికేయ సరసన ‘ఆర్ఎక్స్ 100′(RX 100) చిత్రంతో పరిచయమైన పాయల్ రాజ్ పుత్(Payal Rajput), తొలి సినిమాతోనే రొమాన్స్, బోల్డ్ పాత్రలతో యువతను విశేషంగా ఆకర్షించింది. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. తొలి హిట్‌తో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నా కూడా ఆ తరువాత మాత్రం ఆమె నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు.
ఇప్పటివరకు పాయల్ తెలుగులో మొత్తం 12 సినిమాల్లో నటించింది. అయితే, వాటిలో ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ తప్ప మరే చిత్రమైనా కమర్షియల్ విజయం సాధించలేదు. ఎన్టీఆర్ కథానాయకుడు, RDX లవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయపేటిక వంటి చిత్రాల్లో నటించినా, అవి ఆశించినంత ప్రభావం చూపలేకపోయాయి. కేవలం గ్లామర్ షోకే పరిమితమైపోయింది.
View this post on Instagram
తెలుగుతో పాటు పంజాబీ, కన్నడ చిత్రాల్లో కూడా అడుగుపెట్టిన పాయల్, అక్కడ సైతం పెద్దగా విజయం అందుకోలేకపోయింది. అందం, అభినయంతో పాటు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా, పాయల్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం దక్కడం లేదు. దీంతో సినిమాల కంటే సోషల్ మీడియాకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. తరచూ హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ నెట్టింట్లో హీటెక్కిస్తోంది.
View this post on Instagram
తాజాగా పాయల్ షేర్ చేసిన గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. డిఫరెంట్ డ్రెస్ల్లో, స్టైలిష్ లుక్స్‌తో కనిపించిన ఆమె ఈ ఫోటోలతో కుర్రకారుని కవ్విస్తోంది. నటనలో తానేమాత్రం తక్కువ కాదని ఇప్పటికే రుజువు చేసినా, అందాన్ని ప్రదర్శించడంలోనూ ఎక్కడా తగ్గడం లేదనే చెప్పాలి.






