టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ (Satyadev) యాక్ట్ చేసి కింగ్ డమ్ (Kingdom) మూవీ గురువారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ దేవరకొండకు సోదరుడిగా సత్యదేవ్ నటించి మెప్పించారు. ఇదిలా ఉండగా సత్యదేవ్ హీరోగా యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ ‘అరేబియా కడలి’(Arabia Kadali). సూర్యకుమార్ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీలో తెలుగమ్మాయి ఆనంది (Anandhi) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు క్రిష్ (Krish) జాగర్లమూడి రైటర్‌గానే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా పనిచేస్తుండడం విశేషం. ఆగస్టు 8వ తేదీ నుంచి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) ఫ్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ ట్రైలర్ ను శుక్రవారం టీమ్ రిలీజ్ చేసింది. సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు సంబంధించి కథతో మూవీని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆకట్టుకునేలా ఉన్న అరేబియా కడలి ట్రైలర్ ను మీరూ చూసేయండి.






