టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో సీనియర్ నటిగా కొనసాగుతున్న నటి ఆమని(Amani) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె తెలుగు, తమిళ కన్నడ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది ఆధారాభిమానాలను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఆమని తెలుగులో ప్రముఖ దర్శకుడు EVV సత్యనారాయణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జంబలకడిపంబ(Jambalakadipamba) అనే సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకొని మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత మిస్టర్ పెళ్ళాం, మావిచిగురు, శుభలగ్నం, హలో బ్రదర్, అల్లరి పోలీస్ వంటివి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు.

కుటుంబం కారణంగా ఇండస్ట్రీకి దూరం
ఇలా ఇండస్ట్రీలో ఓవెలుగు వెలుగుతున్న ఆమని తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే వివాహం(Marriage) చేసుకోవడం వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా పెళ్లి తర్వాత పిల్లలు అంటూ కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆమని పలు సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో మాత్రమే కాకుండా బుల్లితెర సీరియల్స్, బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఆమని ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకే..
ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అందరితో పంచుకున్నారు. ఇకపోతే తనకు ఒక బలహీనత కూడా ఉంది అంటూ తన వీక్నెస్ బయట పెట్టారు. ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు తన రోజు ప్రారంభం అవుతుందన్నారు. రోజు తాను ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేస్తానని, నిద్రలేచిన వెంటనే తాను మొదట చేసే పని స్నానం చేసి పూజ (Pooja) చేయటమేనని తెలిపారు. పూజ చేసిన తర్వాతనే ఇతర పనులు చేసుకుంటాను పూజ చేయకుండా నేను బయటకు కూడా వెళ్లనని చెప్పారు. ఏ రోజేనా పూజ చేయకుండా వెళ్తే ఆ రోజంతా నా మనసు బాగుండదని ఆమెని చెప్పుకొచ్చారు.







