తమిళం, తెలుగు సినిమాల్లో తనదైన శైలిలో పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న హీరో సిద్ధార్థ్(Siddharth), గతంలో ఎన్నో హిట్ ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాలతో బాక్సాఫీస్ వద్ద మంచి మార్కులు కొట్టారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన కెరీర్ స్థిరంగా సాగలేదు. వరుసగా ఫ్లాపులు ఎదురయ్యాయి. ఎంతో ఆశతో విడుదలైన భారతీయుడు 2 సైతం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సమయంలో రేసులో నిలవాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. ఈ దశలో సిద్ధార్థ్ ‘3BHK’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ను నమ్ముకున్నారు.
ఈ మూవీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ భావోద్వేగాలు, సొంతింటి కల చుట్టూ తిరుగుతుంది. జూలై 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టకపోయినా, మంచి రివ్యూలు మాత్రం అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ(OTT Release)లోకి రావడానికి సిద్ధమైంది. ఆగస్ట్(August) 1 నుంచి ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో “Simply South” ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్స్ ఇటీవల స్పష్టత ఇచ్చారు.
ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన చైత్ర జే ఆచార్ నటించగా, శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. చిత్రంలో ఆర్. శరత్ కుమార్, దేవయాని, యోగిబాబు, వివేక్ ప్రసన్న, సుబ్బు పంచులు కీలక పాత్రలు పోషించారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ ఈ సినిమాను నిర్మించగా, దినేష్ బీ కృష్ణన్ మరియు జితిన్‌లు సినిమాటోగ్రఫీ అందించారు. సంగీతాన్ని అమృత్ రామ్‌నాథ్ అందించారు.
అయితే ఈ మూవీ ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. భారత్‌కు వెలుపల ఉన్న ప్రేక్షకులు మాత్రమే 3BHK సినిమాను వీక్షించగలుగుతారు. భారతదేశంలో స్ట్రీమింగ్కి సంబంధించి త్వరలోనే మరింత సమాచారం వెల్లడించనున్నట్లు ప్రకటించారు.






