నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్(Rescue operation) కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో SLBCలో పనులు ప్రారంభమైన కాసేపటికే టన్నెల్ పైకప్పులో చిన్న క్రాక్స్ ఏర్పడి ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 8 మంది కార్మికులు(workers) అందులోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్య్కూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టింది. కానీ ఇప్పటి వరకు ఇందులో పురోగతి కనిపించలేదు. చిక్కుపోయిన 8 మంది కార్మికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రమాదం జరిగి 24 గంటలు పూర్తయినా.. సహాయక చర్యల్లో పురోగతి కనిపించకపోవడంతో ఆందోళన నెలకొంది.
#Telangana: Rescue Operations Underway for 8 Workers Trapped in SLBC Tunnel Collapse
To rescue eight trapped workers, NDRF teams have entered the collapsed Srisailam Left Bank Canal (SLBC) tunnel in Nagarkurnool, Telangana. The operation is challenging due to knee-deep mud and… pic.twitter.com/x4AQmkvghb
— South First (@TheSouthfirst) February 23, 2025
రంగలోకి భారత సైన్యం
ఇదిలా ఉండగా ఈ ప్రమాదంపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao) స్పందించారు. వారు మాట్లాడుతూ కూలిన టన్నెల్ పూర్తిగా బ్లాక్ అయిపోయిందని, గల్లంతయ్యారని వెల్లడించారు. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. NDRF, SDRF సిబ్బందిని రప్పించామని అటు, భారత సైన్యం(Army)తో కూడా మాట్లాడామని వారు తెలిపారు. టన్నెల్ 14KM వద్ద 8 మీటర్ల మేరా మట్టికూలి టన్నెల్ మూసుకుపోయిందని మంత్రులు తెలిపారు. ఇప్పటి వరకూ 13.5KM మేర సిబ్బంది వెళ్లారని, మరో అరకిలో మీటర్ వెళితే కార్మికులను చేరుకోవచ్చని, కానీ అక్కడ మొత్తం బురద నీరు మోకాళ్లలోతు ఉండటంతో లోపలికి వెళ్లడం సాధ్యపడటం లేదన్నారు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కార్మికులను సజీవంగా బయటికి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
During the entire day, I reviewed and assessed the Rescue Operations at the SLBC tunnel site following the accident which happened inside the tunnel today.
Our Government and the Irrigation Ministry is leaving no stone unturned in the rescue operations of the trapped workers. pic.twitter.com/KqZFzaoqyh
— ARajnikanth (@A_Rajnikanth) February 22, 2025
సీఎం రేవంత్ బాధ్యత వహించాలి: KTR
ఇదిలా ఉండగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్‌దే అని వ్యాఖ్యానించారు. సుంకిశాల ఘటన మరువకముందే మరో దుర్ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యమే అని విమర్శించారు. టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. SLBC ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.






