SSMB29 టైటిల్ లీక్.. ఫస్ట్ లుక్ రాకముందే హైప్ డబుల్!

ఇండస్ట్రీలో అన్ని వర్గాల సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న భారీ సినిమా ఎస్ ఎస్ ఎం బి 29(SSMB29). మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో రూపొందబోతున్న ఈ పాన్ వరల్డ్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాజమౌళి సినిమాలు అంటేనే భారీ మేకింగ్, విభిన్న కాన్సెప్ట్, ప్రపంచ స్థాయి విజువల్స్. అలాంటి దర్శకుడితో మహేష్ బాబు సినిమా చేయడం అనగానే సినిమా స్టార్స్ నుంచీ అభిమానుల వరకు అంతా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు.

ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి సంబంధించి ఓ లీక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. రాజమౌళి ఈ సినిమాకి “విక్రమాచార్య” అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు టాక్. ఈ టైటిల్ మహేష్ బాబు పాత్ర పేరు కూడా కావచ్చని ప్రచారం జరుగుతోంది. రాజమౌళి టైటిల్స్ విషయంలో చాలా ప్రత్యేకత చూపిస్తాడు. కథకు న్యాయం చేసేలా, డిప్ మీనింగ్ కలిగిన పేర్లే ఆయన ఎంపిక చేస్తాడు. అందుకే ‘విక్రమాచార్య’ అనే పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియాలో #Vikramacharya అనే హ్యాష్‌ట్యాగ్ వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రెండో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ ఎంపిక అయినట్టు టాక్. కానీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం స్క్రిప్ట్ పనుల్లో మునిగిపోయినట్లు సమాచారం. ప్రతి సీన్‌, ప్రతి విజువల్‌ అంతా కేర్‌ఫుల్ ప్లానింగ్‌తో ఫిక్స్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ గురించి అప్‌డేట్స్ వచ్చిన ప్రతీసారీ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో బజ్ క్రియేట్ అవుతోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *