స్టార్ హీరో సూర్య (Suriya), హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కలిసి నటించిన సినిమా ‘రెట్రో’ (Retro). కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ మూవీగా రూపొందింది. మే 1న రిలీజ్ థియేటర్లలో రిలీజ్ అయ్యి సందడి చేసిన ఈ సినిమా.. నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 31 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా రెట్రో స్ట్రీమింగ్ కానుంది. సినిమాలో జోజూ జార్జ్, సూర్య జయరామ్, నాజర్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు.
రెట్రో సినిమా 18 రోజుల్లో రూ. 235 కోట్లు రాబట్టినట్లు కొద్దిరోజుల క్రిత మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే యావరేజ్‌గా ఉన్న సినిమా ఆ స్థాయిలో కలెక్షన్లు సాధించలేదని, మేకర్లు ఫేక్ కలెక్షన్లు చూపిస్తున్నారని కొందరు విమర్శించారు. రెట్రో కలెక్షన్లపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది.
ఇదీ రెట్రో కథ..
పారి అలియాస్ పార్వెల్ కన్నన్ (సూర్య) చిన్నతనంలోనే పుట్టిన ఊరికి, తల్లిదండ్రులకు దూరమవుతాడు. అనాథగా మిగిలిన అతడిని గ్యాంగ్‌స్టర్ తిలక్ (జోజు జార్జ్) దత్తత తీసుకుంటాడు. ఈ క్రమంలో తిలక్ నీడలోనే తానూ గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. అయితే రుక్మిణి (పూజా హెగ్డే)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక గ్యాంగ్‌స్టర్ జీవితానికి ముగింపు పలకాలనుకుంటాడు. హింసను వదిలేసి భార్యతో కలిసి ప్రశాంతంగా జీవించాలనుకుంటాడు. ఈ సంఘర్షణలో సాగే సినిమానే రెట్రో కథ.






