టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekar Kommala) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటించిన తాజా చిత్రం ‘కుబేర’(Kubera). ఈ చిత్రం జూన్ 20న విడుదలై ఊహించని రీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ‘‘ఇది అతని ప్రపంచం… తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు’’ అనే క్యాప్షన్‌తో సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. థియేటర్లలో విడుదలై నెల రోజుల్లోపే ఓటీటీలోకి రావడం గమనార్హం.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు కలిసి నిర్మించారు. జిమ్ సర్బ్, దలీప్ తాహిల్, ప్రియాంశు ఛటర్జీ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు.
it’s his world and he’s here to prove it 😎#KuberaaOnPrime, Watch Now: https://t.co/NjXCIAKZ2D@dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @jimSarbh @sekharkammula @ThisIsDSP @mynameisraahul @AdityaMusic @KuberaaTheMovie @SVCLLP @amigoscreation pic.twitter.com/k5UPB5gnWm
— prime video IN (@PrimeVideoIN) July 17, 2025
కథ, కస్టూమ్స్, నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ — అన్నీ కలసి ఈ సినిమాను ఓ విజువల్ ఫీస్ట్‌గా మార్చాయి. ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉండటంతో థియేటర్స్‌కి వెళ్లలేని ప్రేక్షకులు ఇంట్లోనే వీక్షించే అవకాశం పొందారు.






