సూర్య (Suriya) హీరోగా కోలీవుడ్ హాస్య నటుడు ఆర్జే బాలాజీ (RJ Balaji) ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘సూర్య 45’గా ఇది ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. ‘కరుప్పు’ (Karuppu) అనే పేరు ఫిక్స్ చేసినట్లు తెలిపింది. టైటిల్ పోస్టర్ షేర్ చేసిన సూర్య దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్రిష హీరోయిన్. రెండు దశాబ్దాల తర్వాత సూర్య, త్రిష కలిసి నటిస్తున్నారు.
ఆచితూచి కథల ఎంపిక
గత సినిమాలు కంగువా, రెట్రో అనుకున్న విజయం సాధించకపోవడంతో సూర్య కథల ఎంపికలో మరింత ఆచితూచిగా వ్యవహరిస్తున్నారు. ఆర్జే బాలాజీ పవర్ఫుల్ కథ చెప్పడంతో ఇందులో నటించేందుకు ఆయన ఓకే చెప్పారు. కరుప్పును ఫాంటసీ యాక్షన్ మూవీగా తీర్చిదిద్దుతున్నట్లు కోలీవుడ్‌లో టాక్. దాదాపు ఏడాదికి పైగా స్క్రిప్ట్‌పై కసరత్తులు చేసినట్లు చిత్ర యూనిట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. రేడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించిన బాలాజీ.. ఆ తర్వాత నటుడు, గాయకుడిగా సత్తాగానే కదా దర్శకుడిగానూ సత్తా చాటారు. నయనతార కీలక పాత్రలో ఆయన రూపొందించిన ‘అమ్మోరు తల్లి’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘వీట్ల విశేషం’ అంటూ సత్యరాజ్‌తో ఓ మూవీ తీసి సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఏకంగా టాప్ హీరో సూర్యతోనే మూవీ చేస్తున్నారు.








