టాలీవుడ్‌లో ఎక్కువ మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ అంటే అనుష్క శెట్టి(Anushka Shetty) పేరే ముందు వస్తుంది. గ్లామర్ రోల్స్‌తో కెరీర్‌ను ప్రారంభించినా, తక్కువ సమయంలోనే వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ‘అరుంధతి’, ‘పంచాక్షరి’, ‘రుద్రమదేవి’ వంటి చిత్రాల్లో సోలోగా సత్తా చాటింది.
అనుష్క శెట్టి పెళ్లి గురించి చాలాకాలంగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి తర్వాత అనుష్క, ప్రభాస్(Prabhas) మధ్య ప్రేమ ఉందంటూ వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలను వారు ఖండించినప్పటికీ అనుష్క పెళ్లి గురించి చర్చలు మాత్రం ఆగలేదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క తాను పెళ్లి(Marriage ) విషయంలో తీసుకున్న నిర్ణయాలపై స్పందించింది. ‘‘నాకు పెళ్లిపై నమ్మకం ఉంది. కానీ ప్రేమ లేకుండా ఎవరిని పెళ్లి చేసుకోను. సరైన వ్యక్తి, సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటా,’’ అని ఆమె స్పష్టం చేసింది. తల్లిదండ్రుల మద్దతు కూడా తనతోనే ఉందని తెలిపింది. ఇక, తాను సినీ రంగానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని స్పష్టంచేసింది.
లాస్ట్ ఇయర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో మరో విజయం అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం క్రిష్(Director Krish) డైరెక్షన్‌లో ‘ఘాటీ(Ghaati)’ చిత్రంతో వస్తోంది. ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు, బెంగళూరులో ఉన్న తన నివాసాన్ని మార్చుకున్నట్లు వార్తలు రావడంతో ఆమె పెళ్లికి సంబంధించి మరిన్ని ఊహాగానాలకు బలం చేకూరింది. కానీ అనుష్క తాజా వ్యాఖ్యలతో ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడినట్టే.






