తెలంగాణ(Telangana)లో ఇంజినీరింగ్(Engineering) చేయాలనుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ ఫీజుల(Engineering Fees)ను పెంచకూడదని నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత ఫీజులనే ఈ ఏడాది కూడా కొనసాగించాలని సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో వేలాది మంది విద్యార్థుల(Students)కు భారీ ఊరట లభించినట్లయింది. ఈ ఉత్తర్వులు B.Tech, B.E, M.Tech, M.E, B-ఒకేషనల్ వంటి అన్ని రకాల ఇంజినీరింగ్ కోర్సులకు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇటీవల ఇంజినీరింగ్ కాలేజీల(Engineering colleges)లో ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని
ఈ మేరకు ఫీజుల ఖరారుకు ముందు సమగ్రంగా అధ్యయనం చేయాలని, ఇతర రాష్ట్రాల్లోని విధానాలను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఎంసెట్ కౌన్సెలింగ్(TG EAPCET 2025 Counseling) ప్రక్రియను సకాలంలో ప్రారంభించేందుకు, పాత ఫీజుల (గరిష్ఠంగా రూ.1.65 లక్షలు) ప్రకారమే అడ్మిషన్లు(Admitions) చేపట్టాలని యోచించారు. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాత ఫీజులనే కొనసాగిస్తూ తుది నిర్ణయం తీసుకుంది.

వారికి కూడా పాత ఫీజులే వర్తింపు
అంతేకాకుండా, పాలిటెక్నిక్ డిప్లొమా(Diploma) పూర్తి చేసి ECET ద్వారా నేరుగా బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుంది. వారికి కూడా పాత ఫీజులనే వర్తింపజేయనున్నారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఫీజులపై నెలకొన్న గందరగోళానికి తెరపడటంతో పాటు, కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది.







