మహిళా నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తీపికబురు అందించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ (Women Welfare Department)లో పలు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఈ శాఖలో 14,236 పోస్టుల భర్తీకి ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. 6399 అంగన్వాడీ టీచర్లు, 7837 హెల్పర్ల (Helper Jobs in Telangana) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు.
కోడ్ ముగియగానే నోటిఫికేషన్
ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆయా జిల్లా కలెక్టర్లు అందుకు సంబంధించిన నోటిఫికేషన్లను జారీ చేయనున్నట్లు వెల్లడించాయి. మొత్తం 14,236 పోస్టులను భర్తీ చేయనున్నామని.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు (anganwadi teacher jobs), హెల్పర్ల కొలువులను భర్తీ చేయడం ఇదే తొలిసారని తెలిపాయి. ఖాళీల భర్తీ ప్రక్రియతో అంగన్వాడీలు మరింత పటిష్టంగా పనిచేయనున్నట్లు ఆశా భావం వ్యక్తం చేశాయి.






