అమెరికా(America)లో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని శ్రీజా వర్మ(Sreeja Verma) దుర్మరణం చెందింది. ఈ ఘటన భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం చికాగో(Chicago)లో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా రామారుకల గ్రామానికి చెందిన శ్రీనివాస్ వర్మ(Srinivas Varma), హేమలత(Hemalatha) దంపతుల పెద్ద కుమార్తె అయిన శ్రీజా, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, ఇటీవల MS పూర్తి చేసింది. ఆమె ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో శ్రీజా తన అపార్ట్‌మెంట్ నుంచి స్నేహితురాలితో కలిసి భోజనం కోసం రెస్టారెంట్‌కు కారులో వెళ్లింది. తిరిగి వస్తుండగా, వారి కారును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో శ్రీజా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న ఆమె స్నేహితులు కూడా గాయపడినట్లు సమాచారం.
మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
కాగా శ్రీజ తండ్రి శ్రీనివాస్ వర్మ డ్రైవర్‌గా, హేమలత ప్రైవేటు సంస్థలో పని చేస్తూ, హైదరాబాద్(Hyderabad)లోని మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ సమీపంలోని శ్రీకృష్ణనగర్‌లో నివసిస్తున్నారు. వారి చిన్న కుమార్తె శ్రేయా వర్మ కూడా 20 రోజుల క్రితం ఎంఎస్ కోసం అమెరికా వెళ్లింది. శ్రీజా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కుటుంబం అమెరికాలోని తెలుగు సంఘాల సహాయం కోరింది. ఈ ఘటన కుటుంబాన్ని, సన్నిహితులను తీవ్ర శోకంలో మునిగేలా చేసింది.
Tragic news from Chicago:
Telangana native Sreeja Varma(23), daughter of Srinu Rao from Balaji Nagar, Medchal district, lost her life in a road accident. Sreeja, who had moved to the US for higher studies, was walking to a restaurant for dinner when she was fatally hit from… pic.twitter.com/peT10LIEDO
— cinee worldd (@Cinee_Worldd) August 12, 2025






