తెలంగాణలోని టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం టెట్-2025(Telangana State Teacher Eligibility Test) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య తెలంగాణలో టెట్ నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్(School Education Department) ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 15న పూర్తి నోటిఫికేషన్(Notification) విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.
నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం..
కాగా ఇంటర్ తర్వాత డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(Diploma in Elementary Education) పూర్తి చేసినవారు TET Paper-1 పాసవ్వాలి. డిగ్రీ తర్వాత BEd చేసినవారు టెట్ పేపర్-2లో ఉత్తీర్ణత సాధించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం సెక్షన్ 23(1) నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(National Council for Teacher Education) నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే టెట్లో అర్హత పొందడం తప్పనిసరి.
ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయం
ఇప్పటి వరకు DEd, BEd తదితర కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు. కానీ, NCTఈ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం టీచర్ల ప్రమోషన్లకూ(Teacher Promotions) టెట్ క్వాలిఫై తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (Telangana State Teacher Eligibility Test)ను ఇక నుంచి ఏటా 2 సార్లు నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏటా జూన్, డిసెంబర్/జనవరిలో నిర్వహించేలా ప్రభుత్వం స్పెషల్ షెడ్యూల్కూడా ఖరారు చేసింది. గతంలోనే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించిన విషయం తెలిసిందే.








