టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు(Kota Srinivasarao) ఈ రోజు (జులై 13) తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు(Passes Away). 83 ఏళ్ల కోట గత కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణా జిల్లా(Krishna District) కంకిపాడులో 1942 జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు, తన తండ్రి కోట సీతారామాంజనేయులు, ప్రసిద్ధ వైద్యుడైన తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. బాల్యంలో నాటకాలపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టే ముందు స్టేట్ బ్యాంకు(State Bank)లో ఉద్యోగిగా పనిచేశారు. 1978లో ‘ప్రాణం ఖరీదు(Pranam Kareedu)’ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ప్రవేశించి, 750కి పైగా చిత్రాల్లో నటించారు.

ఇండస్ట్రీలో చెరగని ‘కోట’కు 9 నంది అవార్డులు
కోట విలన్, కమెడియన్, తండ్రి, సహాయ పాత్రల్లో తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ‘ఆహ నా పెళ్లంట’, ‘గబ్బర్ సింగ్’, ‘రాఖి’, ‘బృందావనం’ వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. 9 నంది అవార్డులు(Nandi Awards), 2012లో ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రానికి సైమా అవార్డు(Saima Award), 2015లో పద్మశ్రీ(Padma Sri) పురస్కారం అందుకున్నారు. రాజకీయాల్లో కూడా కోట సత్తా చాటారు. 1999-2004 మధ్య విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. వ్యక్తిగత జీవితంలో, 1966లో రుక్మిణితో వివాహమైన ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే, 2010లో ఆయన కుమారుడు ఆంజనేయ ప్రసాద్(Anjaneya Prasad) రోడ్డు ప్రమాదంలో మరణించారు, ఇది ఆయనకు తీవ్ర శోకం మిగిల్చింది.

‘కోట’ కుటుంబానికి సినీ,రాజకీయ ప్రముఖుల సంతాపం
కోట శ్రీనివాసరావు మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, బాబు మోహన్, బ్రహ్మానందం, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, వెంకటేశ్, నాగార్జున తదితరులు ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. కోట శ్రీనివాసరావు నటనా ప్రస్థానం తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాగా ఈరోజు మధ్యాహ్నం కోట అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.
🎭 Legendary actor Kota Srinivasa Rao passes away at 83 in Hyderabad. The veteran performer, known for his iconic villain and comedy roles across 750+ films, leaves behind an extraordinary 4-decade legacy in Indian cinema. A true legend gone too soon.https://t.co/NJnoixruPI… pic.twitter.com/ZXoheSi5Hc
— Benefit News 24 (@BenefitNews24) July 13, 2025






