IBPS: బ్యాంకుల్లో 5291 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

Mana Enadu: ట్రైనీఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) కింద స్పెషలిస్ట్ ఆఫీసర్ (CRP SPL-XIV)/మేనేజ్‌మెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగం సంపాదించవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 4455 ఖాళీలను భర్తీ చేయనున్నారు. BOB,BOI,కెనరా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, IOB,PNB,పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

 అర్హతలు

డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. 20-30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రూల్స్ ప్రకారం ఏజ్‌లో సడలింపు వర్తిస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్‌ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 21లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితోపాటు ప్రభుత్వ బ్యాంకుల్లో 896 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన కూడా విడుదలైంది. పూర్తి వివరాల కోసం
వెబ్‌సైట్‌: https://ibps.inలో చూడవచ్చు.

 అప్లికేషన్ ఫీజు

– SC/ST/PwD అభ్యర్థులకు: రూ.175 (GSTతో కలిపి)
– మిగతా అభ్యర్థులందరికీ : రూ.850/- (GSTతో కలిపి) ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

* ముఖ్యమైన తేదీలు

– ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ : 01-08-2024
– ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 21-08-2024
– ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్ తేదీ : అక్టోబర్ 2024
– ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీ: నవంబర్ 2024
– ఫలితాల ప్రకటన తేదీ: నవంబర్/ డిసెంబర్, 2024
– మెయిన్స్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్ తేదీ : డిసెంబర్ 2024
– మెయిన్స్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2024
– మెయిన్స్ పరీక్ష ఫలితాల ప్రకటన తేదీ: జనవరి/ఫిబ్రవరి 2025
– ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ: ఫిబ్రవరి/మార్చి 2025

 

Related Posts

Govt Jobs: గుడ్‌న్యూస్.. తెలంగాణ ఆరోగ్య శాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్…

AI: ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఈ ఐదు కోర్సులు పూర్తిగా ఉచితం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖ మంచి అవకాశాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ‘స్వయం పోర్టల్‌’ ద్వారా ఉచిత ఏఐ కోర్సులను( Free AI courses)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *