జక్రాన్​పల్లిలో కారు బోల్తా…

కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఏలేటి సాయి ప్రశాంత్(28) అనే యువకుడు తీవ్రగాయలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని బ్రాహ్మణ పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.

ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తొర్లికొండ గ్రామానికి చెందిన సాయి ప్రశాంత్

తొర్లికొండ నుండి కారులో ఆర్మూర్ వెళ్తుండగా బ్రాహ్మణ పల్లి గ్రామ శివారులో కారు అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సాయి ప్రశాంత్ తలకు బలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవఖానకు తరలించారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

Related Posts

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. పరిశ్రమలో రియాక్టర్ పేలి 10 మంది మృతి

సంగారెడ్డి (Sangareddy) జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ఘోరం జరిగింది. భారీ పేలుళ్లు సంభవించి పది మంది మృతిచెందారు. పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం రియాక్టర్ పేలింది (Reactor Blast). దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి అందులోని 20 మంది కార్మికులకు…

Thunderstorm: ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల బీభత్సం.. 8 మంది మృతి 

ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో గురువారం పిడుగులు (Thunderstorm) బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని గాదిగూడ, బేల మండల్లాలో పిడుగులు పడి 8 మంది మృతి చెందారు. వీరంతా ఆదివాసీలే. పొలాలు, చేనుల్లో వ్యవసాయ పనులు చేస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన పిలుగు కూలీల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *