సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి సుహాసిని(Suhasini) గురించి చెప్పనవసరం లేదు. ఆమె నటించిన సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆమె, ఒక్క తెలుగులోనే 50కి పైగా చిత్రాల్లో నటించారు. అలాగే తమిళ, మలయాళ భాషల్లోనూ మంచి గుర్తింపు పొందారు.
నటిగా మాత్రమే కాదు, సుహాసిని దర్శకురాలిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు చిత్రాల్లో ముఖ్యమైన సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ మణిరత్నాన్ని వివాహం చేసుకున్న తర్వాత హీరోయిన్గా నటించడాన్ని తగ్గించిన ఆమె, వెండితెరపై వినూత్న పాత్రలతో తిరిగి కనిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఒక ఇంట్రస్టింగ్ విషయమేమిటంటే.. సుహాసినికి చెల్లెలు ఇండస్ట్రీలోనే మోస్ట్ పాపులర్ పాన్ ఇండియా హీరోయిన్గా దూసుకుపోతున్న శ్రుతి హాసన్! అవును, మీరు చదివింది నిజమే. సుహాసిని(Suhasini)కి శ్రుతి(shruti haasan) హాసన్ చెల్లెలే. సుహాసిని తండ్రికి కమల్ హాసన్ సొంత అన్న. అంటే శ్రుతి హాసన్ సుహాసిని అక్కాచెల్లెళ్లు అన్నమాట. ఈ ఆసక్తికర విషయం చాలా మందికి ఇప్పటికీ తెలియదు.
శ్రుతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ‘గబ్బర్ సింగ్’, ‘శ్రీమంతుడు’, ‘రేసుగుర్రం’ వంటి హిట్ చిత్రాల్లో నటించి క్రేజ్ తెచ్చుకుంది. ‘సలార్’ చిత్రం ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న శ్రుతి ప్రస్తుతం ‘సలార్ 2’తో పాటు మరికొన్ని భారీ సినిమాల్లో నటిస్తోంది.
View this post on Instagram






