బుల్లితెర ప్రేక్షకులకు చైత్ర రాయ్(Chaitra Rai) గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. స్టార్ మా(Star Maa)లో ప్రసారమైన ‘అష్టా చమ్మా’ సీరియల్‌తో మంచి గుర్తింపు సంపాదించింది. ఇందులో స్వప్న అనే పాత్ర ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘మనసున మనసై’, ‘ఒకరికి ఒకరు’, ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’, ‘రాధకు నీవే రా ప్రాణం’ వంటి పాపులర్ సీరియల్స్ లో నటించింది. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “దేవర” సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరోసారి కనిపించింది. ఈ చిత్రంలో ఆమె సైఫ్ అలీ ఖాన్ భార్యగా కీలక పాత్రలో కనిపించింది.
తాజాగా తాను మరోసారి తల్లి కాబోతున్నట్లు స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. ఈ సందర్భంగా బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. “మా జీవితంలోకి మరో హార్ట్ బీట్ రాబోతోంది… ఇప్పుడు మేము ముగ్గురం, త్వరలో నలుగురం కాబోతున్నాం” అంటూ చెప్పే బ్యూటిఫుల్ మెసేజ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఈ వీడియోను చూసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు, టీవీ సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇంజనీర్ అయిన ప్రసన్న శెట్టిని ఆమె వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇప్పటికే ఒక కూతురు ఉంది. ఇప్పుడు మరోసారి తల్లి అయినందుకు నటి ఎంతో ఆనందంగా ఉంది.
View this post on Instagram






