టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా(Social Media)లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం సినీ పరిశ్రమతోపాటు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రానా, తన భార్య మిహీకా బజాజ్(Miheeka Bajaj)తో కలిసి ఈ ఆనందకరమైన దశలోకి అడుగుపెడుతున్నారంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. కాగా 2020లో వీరిద్దరూ వివాహబంధం(Marriage)లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి కుటుంబంలో కొత్త సభ్యుడు రాబోతున్నాడనే వార్త అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. రానా దగ్గుబాటి, బాహుబలి(Bahubali) చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లోనూ తన నటనా ప్రతిభను చాటాడు.

‘జస్ట్ ఫెల్ట్ లైక్ ఇట్’ అనే క్యాప్షన్
అయితే ఆ మధ్య మిహిక ప్రెగ్నెంట్(pregnant) అని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మరోమారు ఈ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా మిహిక తన ఇన్స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో స్టమక్ మీద హ్యాండ్ వేసి ఫొటోస్(Photos)కి స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ పిక్కు.. ‘జస్ట్ ఫెల్ట్ లైక్ ఇట్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మిహిక ప్రెగ్నెంట్ అని, రానా తండ్రి కాబోతున్నాడని ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరి దీనిపై ఈ జంట స్పందించాల్సి ఉంది.
View this post on Instagram
రానా-మిహీక దంపతులకు అభినందనల వెల్లువ
అంతేకాదు ‘లీడర్(Leader)’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘రుద్రమదేవి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించాడు. నటుడిగా, నిర్మాతగా, విజువల్ ఎఫెక్ట్స్ సమన్వయకర్తగా రానా బహుముఖ ప్రతిభావంతుడుగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం రానా ‘హిరణ్య కశ్యప’, ‘రాక్షస రాజా’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో ‘ది రానా కనెక్షన్(The Rana Connection)’ అనే టాక్ షో ద్వారా అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ టాక్ షోలో టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. కాగా దగ్గుబాటి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రానుండటంతో రానా-మిహీక దంపతులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.







