ఎస్ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) కూలిన ఘటనలో చిక్కుకుకుపోయిన 8 మంది కార్మికుల(Workers) ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఘటన జరిగి దాదాపు 48 గంటలు గడుస్తున్నా.. ఫలితం కనిపించట్లేదు. దీంతో SLBC సొరంగం లోపల చిక్కుకున్న ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికుల పరిస్థితి ఎలా ఉందో తెలియట్లేదు. టన్నెల్లో బురద, నీరు, మట్టి భారీగా పేరుకుపోయి ఉండటంతో అసలు వాళ్లు ఎక్కడున్నారో కూడా రెస్క్యూ సిబ్బందికి(Rescue Personnels) అంతుబట్టడం లేదు. ఇప్పటికే రెండు రోజులుగా NDRF, SDRF, FIRE సిబ్బందితోపాటు ARMY ఎక్స్‌పర్ట్స్ కూడా ఈ ఆపరేషన్‌లో భాగయ్యారు. కానీ ఫలితం మాత్రం కనిపించట్లేదు. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

కనీసం 10 నుంచి 12 రోజులు పడుతుంది..
ఇదిలా ఉండగా సొరంగంలో బురద, నీళ్లు ఉన్నాయని, అలాగే 100 మీటర్ల మేర మట్టి, బండరాళ్లు ఉన్నాయని రెస్క్యూ సిబ్బంది(Rescue Person) ఒకరు చెప్పారు. వీటిని తొలగించాలంటే కనీసం 10 నుంచి 12 రోజులు పడుతుందని అన్నారు. మట్టిని తీసిన తర్వాతే.. లోపలున్న కార్మికులు ఎలా ఉన్నారో తెలుస్తుందని అంటున్నారు. మరి ఇన్ని రోజులు వారు లోపలే ఉంటే.. వారు ప్రాణాలతో బయటకు రాగలరగా అనే సందేహాలు కలుగుతున్నాయి. పైగా లోపల ఆక్సిజన్ అందే పరిస్థితి కూడా లేదంటున్నారు.
#WATCH | Nagarkurnool, Telangana | SLBC tunnel collapse: An operator of the tunnel boring machine says, “…Our mission is left for around 200 meters. Dewatering is going on. It is very difficult right now. After dewatering, we will do the cutting…” pic.twitter.com/aObCqTNTzB
— ANI (@ANI) February 23, 2025
322 మంది సిబ్బంది పాల్గొన్నా..
మరోవైపు రెస్క్యూ ఆపరేషన్‌లో 322 మంది పాల్గొన్నా.. ఫలితం కనిపించట్లేదని మంత్రి జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీ, NDRF, SDRF, సింగరేణి, హైడ్రా బృందాలు ఆపరేషన్‌లో పాల్గొన్నాయని, ఇవాళ నేవీ బృందం కూడా వస్తుందని చెప్పారు. అలాగే ఢిల్లీ నుంచి రాళ్లను తొలగించే ప్రత్యేక బృందం రాబోతోందన్నారు. సొరంగంలోకి వెళ్లిన సిబ్బంది కూడా తిరిగి వెనక్కి వస్తున్నారు. మంత్రి జూపల్లి కూడా లోపలికి వెళ్లి.. 6 గంటల తర్వాత బయటకు వచ్చి.. ఇది అంత తేలిగ్గా అయ్యే పని కాదని అనేశారు. కార్మికులపై ఆశలు సన్నగిల్లుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వంద శాతం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
#Telangana – #SLBCTunnelCollapse :
Even 41 hours after the #Srisailam Left Bank Canal (#SLBC) #TunnelCollapse and 8 workers continue to be trapped inside the #SLBCTunnel
Rescue teams, including #NDRF , #SDRF , #IndianArmy struggle against silt and debris. Seapage water in the… pic.twitter.com/7BmjaZYxs6
— Surya Reddy (@jsuryareddy) February 23, 2025







