విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’(Kingdom) జూలై 31న థియేటర్లలో విడుదల కాబోతుంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సమయంలో విజయ్ దేవరకొండ ఆరోగ్యంపై వచ్చిన వార్తలు అభిమానుల్లో కలకలం రేపుతున్నాయి.
విజయ్ దేవరకొండ డెంగ్యూ బారిన పడినట్టు, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి(Hospitalized )లో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు విజయ్ కుటుంబ సభ్యులు కానీ, విజయ్ టీం కానీ అధికారికంగా స్పందించలేదు. తాజా సమాచారం ప్రకారం, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది.
ఇక ‘కింగ్‌డమ్’ మూవీ విషయంలోకి వస్తే, చిత్రానికి సంగీతం అందించిన అనిరుథ్ రవిచందర్ కంపోజ్ చేసిన ‘అన్నా’ సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. విజయ్‌తో కలిసి నటిస్తున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాదు, రవి కిరణ్ కోల దర్శకత్వంలో ‘రౌడీ జనార్థన్’ అనే మూవీ కూడా విజయ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.






