ఆ స్కీమ్ మళ్లీ తెచ్చిన ఎస్‌బీఐ.. రూ.1 లక్ష పెడితే ఎంతొస్తుంది? మీరే తెలుసుకోండి!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ తమ కస్టమర్లకు తాజాగా శుభవార్త అందించింది. గతంలో విజయవంతమైన డిపాజిట్ స్కీమ్‌ను మళ్లీ పొడిగించింది. అయితే, ఈ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో గనక మీరు 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి ఎంత వస్తుంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం.

దేశీయ దిగ్గజ ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు అదిరే గుడ్‌న్యూస్ చెప్పింది. ఆగస్టు 15తో గడువు ముగిసిన స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ మళ్లీ తీసుకొచ్చింది. అదే ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ (sbi amrit kalash deposit). 400 రోజుల మెచ్యూరిటీ టెన్యూర్ కలిగి ఉండే ఈ ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువు గతంలో మార్చి 31, 2023తో ముగియగా దానిని మరో 3 నెలలు అంటే ఆగస్టు 15 వరకు పొడిగించింది. ఇప్పుడు ఆ గడువు సైతం ముగియడంతో మళ్లీ పొడిగించింది. ఈ క్రమంలో మరోసారి ఎప్పటి వరకు అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగించారు. మీరు ఈ స్కీమ్ లో రూ.1 లక్ష డిపాజిట్ చేసినట్లయితే ఎంతొస్తుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పరిమితకాల స్పెషల్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలశ్ డిపాజిట్ పథకం గడువును మరో నాలుగు నెలలు పొడిగించింది. అంటే ఈ పథకం ప్రయోజనాలను డిసెంబర్ 31 వరకు పొందవచ్చు. ఈ ఏడాది చివరి వరకు ఈ పథకంలో డిపాజిట్ చేసేందుకు కస్టమర్లకు అవకాశం కల్పిస్తూ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం మేర వడ్డీ అందిస్తోంది. అలాగే సాధారణ కస్టమర్లకు 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వడ్డీపై మూలం వద్ద పన్ను టీడీఎస్ (TDS) కోత ఉంటుందని కస్టమర్లు గుర్తుంచుకోవాలి. నేరుగా బ్యాంకుకు వెళ్లడంతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా సైతం ఈ స్పెషల్ స్కీమ్ ఖాతా తెరవొచ్చు. ఇందులో రూ. 2 కోట్ల లోపు వరకు డిపాజిట్ చేసేందుకు వీలుంటుంది. స్వల్ప కాలిక లక్ష్యంతో పొదుపు చేసే వారికి అమృత్ కలశ్ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ కలశ్ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ టెన్యూర్ 400 రోజులుగా ఉంటుంది. ఒక సాధారణ కస్టమర్ ఈ స్కీమ్‌లో రూ.1 లక్ష డిపాజిట్ చేసినట్లయితే అతనికి 7.10 వడ్డీ వర్తిస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయానికి అదనంగా వార్షిక వడ్డీ రూ.7,100 అందుతాయి. మరో 35 రోజులకు ఈ అసలు, వడ్డీ కలిపి మళ్లీ వడ్డీ లెక్కిస్తారు. అంటే మొత్తంగా రూ.7.500 వరకు వడ్డీ లభించవచ్చు. మరోవైపు.. సీనియర్ సిటిజన్లు ఇందులో రూ.1 లక్ష డిపాజిట్ చేసినట్లయితే వారికి 7.60 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయానికి అదనంగా రూ. 8 వేల వరకు అందుతాయి. మొత్తందా 1,08,000 అమౌంట్ పొందుతారు.

Share post:

లేటెస్ట్