పేటీఎం ఫాస్టాగ్ తన అధీకృత లిస్ట్ నుంచి తొలగించింది. దీంతో పేటీఎం ఫాస్టాగ్ వాడేవారికి దానిని ఎలా డీయాక్టివేట్ చేసుకోవాలనే సందిగ్దం నెలకొంది. పేటీఎం ఫాస్టాగ్ ఎలా డీయాక్టివేట్ చేసుకోవాలి?
Paytm Fastag Deactivation : Paytm పేమెంట్స్ బ్యాంక్ సేవలను నిషేధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుండి, కంపెనీ చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. దీని నుంచి బయటపడి తన కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు అది అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్(IHMCL), పబ్లిక్ సెక్టార్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ కలెక్షన్ యూనిట్, 32 అధీకృత బ్యాంకుల నుండి ఫాస్టాగ్ సేవలను పొందాలని హైవే వినియోగదారులకు సూచించింది.
ఈ లిస్ట్ నుంచి NHAI తన Paytm బ్యాంక్‌ను తొలగించింది. Paytm పేమెంట్ బ్యాంక్ మార్చి 15 తర్వాత క్లోజ్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో మనకు కనుక పేటీఎం ఫాస్టాగ్ ఉంటే.. దానికి ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించి మీకు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
మీరు Paytm ఫాస్టాగ్‌ని ఉపయోగిస్తుంటే, ఇప్పుడు దాన్ని ఉపయోగించలేరు. మీరు Paytm Fastag సర్వీస్ బదులుగా మరొక Fastag ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా మీరు Paytm యాప్ నుండి Paytm Fastag ని డియాక్టివేట్(Paytm Fastag Deactivation) చేయాలి. మీరు దీన్ని డీయాక్టివేట్ చేసిన తర్వాత, మీ ఫాస్టాగ్ ఖాతాను మరొక బ్యాంక్‌తో లింక్ చేసే అవకాశాన్ని Paytm మీకు అందిస్తుంది. ఆపై మీరు ఫాస్టాగ్‌ని అధీకృత బ్యాంక్‌తో లింక్ చేయడం ద్వారా దాన్ని ఉపయోగించడం కొనసాగించవచ్చు.
”వైఫ్’ను ఎంతసేపు చూస్తారు..? సండే కూడా ఆఫీసుకు రండి’
భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలంటూ ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీశాయి. చాలా మంది ఈ…