“గదర్ 2” సెన్సేషన్..డే 6 కూడా రికార్డు వసూళ్లు

లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర భారీ వసూళ్లతో డూమ్ లేపుతున్న నయా చిత్రం “గదర్ 2”. దర్శకుడు అనిల్ శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటించగా అమీషా పటేల్ అయితే హీరోయిన్ గా నటించింది. మరి ఈ చిత్రం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్ తో వచ్చినప్పటికీ ట్రేడ్ వర్గాలు షాక్ అయ్యేలా ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకుంది.

అంతే కాకుండా నార్త్ లో అయితే సీక్వెల్స్ లో ఓ బెంచ్ మార్క్ వసూళ్లు కొల్లగొడుతుండగా లేటెస్ట్ గా కూడా భారీ మార్క్ 200 కోట్ల మార్క్ ని కూడా క్రాస్ చేసి అదరగొట్టింది. ఇక ఈ చిత్రం అయితే లేటెస్ట్ గా ఆరవ రోజు కూడా సూపర్ స్టాండర్డ్ వసూళ్లు రాబట్టినట్టుగా తెలుస్తుంది. మరి డే 6 అయితే ఈ చిత్రం 32.37 కోట్ల గ్రాస్ ని అందుకోగా 6 రోజుల్లో ఈ చిత్రం మొత్తం 261.35 కోట్ల గ్రాస్ ని ఇప్పటివరకు అయితే రాబట్టింది. అలాగే వరుసగా ఆరు రోజులు పాటు 30 కోట్లకి పైగా వసూళ్లు అయితే అందుకున్న అతి కొద్ది చిత్రాల్లో ఒకటిగా “గదర్ 2” నిలిచింది.

గదర్ 2 చిత్రం రిలీజ్ తర్వాత పాకిస్థాన్‌ను పరేషాన్ చేశామనే వాదనలో బలం లేదు. ఎందుకంటే వారిని అసంతృప్తికి గురి చేయలేదు. మీరు చెప్పి చెప్పి వార్తలు రాయడం వల్ల ఆ వాదన అలా ప్రచారమైంది. నేను వాఘా బోర్డర్ వద్దకు వెళ్లినప్పుడు పాకిస్థాన్ ప్రజలు నాతో చాలా స్నేహంగా ఉన్నారు. నన్ను చూసి చాలా సంతోషంగా చేతులు ఊపారు. అంతకంటే వారి నుంచి కావాల్సిన ప్రేమ ఏముంది అని సన్నీడియోల్ అన్నారు.

గదర్ 2 సినిమా ప్రేక్షకుల అంచనాలు లేకపోతే ఇలాంటి రెస్సాన్స్, ఆదరణ ఉండేది కాదు. ప్రతీ ఒక్కరు ఈ సినిమాపై చూపిస్తున్న ప్రేమకు చాలా ఆనందం కలుగుతున్నది. చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నామని చెప్పడం ఇంకా ఆనందం కలిగిచింది. ఆ విషయం తెలిసినప్పుడు కలిగిన తృప్తి మాటల్లో చెప్పలేం అని సన్నీడియోల్ అన్నారు.

  • Related Posts

    Daaku Maharaaj: బాక్సాఫీస్ వద్ద బాలయ్య హంటింగ్.. ‘డాకు’ కలెక్షన్స్ ఇవే?

    నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), డైరెక్టర్ బాబీ(Director Bobby) ద‌ర్శ‌క‌త్వంలో మూవీ ‘డాకు మ‌హారాజ్‌(Daaku Mahaaraj)’. సంక్రాంతి(Sankranti) కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అభిమానుల‌కు కావాల్సిన యాక్ష‌న్‌తో పాటు మంచి ఎమోష‌న్(Emotions) కూడా ఉండ‌డంతో తొలి ఆట…

    Pushpa-2 TheRule: తగ్గిన ‘పుష్ప2’ టికెట్ రేట్లు.. రేపటి నుంచి రీలోడెడ్ వెర్షన్

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించి పుష్ప-2(Pushpa2) ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్‌ ఫుల్‌గా దూసుకుపోతోంది. రిలీజ్ అయి(DEC 5th) దాదాపు 50 రోజులకు చేరువలో ఉన్న బన్నీ(Bunny) మూవీపై మాత్రం అభిమానుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *