పవన్ కళ్యాణ్ పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు.

ఏపీలో టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలపై ఆయన సహ నటుడు, హీరో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం బ్రో వైఫల్యంపైనా పరోక్షంగా స్పందించారు. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ పొజిషన్ పైనా మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీలో ఓటర్ల తీరు ఎలా ఉండబోతోందన్నది కూడా మంచు విష్ణు చెప్పేశారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వూలో విష్ణు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఏపీలో ఓవైపు రాజకీయాల్ని, మరోవైపు సినిమాల్నీ ఏకకాలంలో చేస్తూ పవన్ కళ్యాణ్ బిజీగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రం బ్రో విడుదలై మిశ్రమ ఫలితాలు అందుకుంది. ఈ నేపథ్యంలో తన తాజా చిత్రం భక్త కన్నప్పలో నటిస్తున్న హీరో మంచు విష్ణు పవన్ కళ్యాణ్ చిత్రాలు, రాజకీయాలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలపై స్పందించడానికి తాను బ్రహ్మం గారినా అని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ సినిమాలపై అయితే చెప్పగలనంటూ మంచు విష్ణు స్పందించారు. సినిమా పరిశ్రమలో పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అని, ఇందులో సందేహమే లేదన్నారు. అలాగే పవన్ ఓ సినిమా ఆడకపోయినా మరో సినిమాలో మంచి కలెక్షన్స్ వస్తాయని తెలిపారు. దీంతో తాజాగా విడుదలైన బ్రో సినిమా ఫ్లాప్ గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ మొదలైంది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలపై మాత్రం తానేమీ చెప్పలేనన్నారు. అలాగే ఏపీ రాజకీయాలపైనా మంచు విష్ణు పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.

రాజకీయాల విషయంలో ప్రజలు చాలా స్మార్ట్ గా ఉన్నారని మంచు విష్ణు తెలిపారు. సినిమా వస్తే చూస్తారు కానీ ఓటు వేయాలనుకున్నప్పుడు మాత్రం నచ్చిన పార్టీకే వేస్తారని కుండబద్దలు కొట్టేశారు. అలాగే సినీ రంగంలో మహానుభావులే రాజకీయాల్లో ఓడిపోయారంటూ మరో ఉదాహరణ కూడా ఇచ్చారు. ఒక్కోసారి రాజకీయాల్లో పేరు పొందిన లెజెండ్స్ ను సైతం ప్రజలు ఓడించారని గుర్తుచేశారు. అలాగే మరో ఆరు నెలలు ఆగితే పవన్ భవిష్యత్తు ఏంటో చెప్తానని మంచు విష్ణు స్పష్టం చేశారు. తద్వారా పవన్ సినిమా చూసినంత మాత్రాన ఓటేస్తారన్న గ్యారంటీ లేదనే విషయాన్ని మంచు విష్ణు పరోక్షంగా తేల్చిచెప్పేశారన్న చర్చ జరుగుతోంది.

Share post:

లేటెస్ట్