వచ్చే ఏడాది నుంచి కర్ణాటకలో జాతీయ విద్యా విధానం-2020ని రద్దు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 2024-25 విద్యా సంవత్సరం నుంచి కర్ణాటకలో జాతీయ విద్యా విధానం-2020ని రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. మంగళవారం జరిగిన కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ బాడీ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు.

వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం అమలు నిలిపేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేయకుండా జాతీయ విద్యావిధానం-2020ని కర్ణాటకలో మాత్రమే అమలు చేసిందని సిద్దరామయ్య గుర్తు చేశారు. మనువాద భావజాలంతో కూడిన ఈ విద్యావిధానం కంటే రాజ్యాంగం ప్రకారం కర్ణాటకలో విద్యావిధానం అమలవుతుందని సిద్ధరామయ్య తెలిపారు. బిజెపి అధికారంలో ఉండగా.. మనువాద భావజాలంతో విద్యావిధానంలో జరిగిన కాషాయీకరణను సరిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఈ ఏడాది రాష్ట్రంలో విద్యా సంవత్సరం మొదలయ్యే సమయంలో ఎన్నికలు జరిగి ఫలితాలు రావడంతో ఈ నిర్ణయం అమలు చేయడం సాధ్యం కాదని సిద్ధరామయ్య తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి జాతీయ విద్యావిధానం అమలు రద్దు నిర్ణయం అమల్లోకి వస్తుందని సిద ్ధరామయ్య ప్రకటించారు. రాజ్యాంగానికి అనుగుణంగా విద్యను అందించడానికి ప్రయత్నిస్తామన్నారు. బిజెపి వారు మనువాదాన్ని నమ్ముతారని సిద్ధరామయ్య అన్నారు. ఎన్‌ఇపిని విద్యార్థులు, తల్లిదండ్రులు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు వ్యతిరే కిస్తున్నారని చెప్పిన సిద్ధరామయ్య.. ఇతర రాష్ట్రాలు అమలు చేయకముందే కర్ణాట కలో ఎన్‌ఇపిని అమలు చేయడం ద్వారా బిజెపి విద్యార్థులకు నష్టం చేసిందన్నారు.

Share post:

Popular